గత రెండేళ్ళ నుంచి కరోనా దెబ్బకు అన్ని రంగాలు కూడా ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు చాలా వరకు రైల్వే రంగం కూడా ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తుంది అనే మాట వాస్తవం. ఇక ఇప్పుడు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని, దురంతో, శతాబ్ది, వందే భారత్, తేజస్, గతిమాన్‌ రైళ్ల ప్రయాణీకులకు శుభ వార్త చెప్పింది రైల్వే. అన్ని రైళ్లలో ఆహార సరఫరా సౌకర్యాన్ని పునరుద్ధరిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చింది రైల్వే బోర్డు.

కరోనా కారణంగా నిలిపి వేసిన సౌకర్యాన్ని పునరుద్దరిస్తూ.. ఇటీవల నిర్ణయం తీసుకున్నది బోర్డు.  కరోనా జాగ్రత్తలతో... రైళ్లలో ఆహారం సరఫరా చేసేందుకు అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఐఆర్‌సిటిసి, అన్ని జోన్ల కమర్షియల్‌ మేనేజర్లకు ఆదేశాలు ఇచ్చింది రైల్వే బోర్డు. గత ఏడాదికి పైగా రైల్వే సర్వీసుల నుంచి ఆహార ఏర్పాట్లు లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: