వ‌ర్షాల కార‌ణంగా వ‌చ్చిన వ‌ర‌ద బాధితుల‌ను ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగదు అని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఒక్క సెంటు పంట నష్టపోయినా ఆదుకుంటామని మంత్రి స్ప‌ష్టం చేసారు.  చంద్రబాబుకు రాజకీయ ఆలోచన తప్ప మరోటి లేదని పేర్కొన్నారు. ఏపీ ప్ర‌భుత్వం వరద బాధితులను త‌ప్ప‌కుండా ఆదుకుంటుంది అని స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టికే వ‌ర‌ద న‌ష్టాన్ని అంచెనా వేస్తున్నాం. ఇది ప్ర‌కృతి ప‌రంగా వ‌చ్చిన విప‌త్తు అని,  ఊహించని నీరు రావడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు తెగింది తప్ప, ఇందులో ఎవరి తప్పులేదని పేర్కొన్నారు. అధికారంలోకి రావాలనే ధ్యాసతోనే  టీడీపీ అధినేత చంద్రబాబు మాపై విమర్శలు చేస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. చంద్ర‌బాబుకు అస‌లు మ‌తి స్థిమితం లేద‌ని చెప్పారు. తాను అధికారంలోకి వచ్చాక వరద బాధితులకు పరిహారం ఇస్తానని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మ‌రోవైపు లక్ష 42 ఎక‌రాల‌లో పంట న‌ష్టం జ‌రిగింద‌ని.. మొత్తం ఇప్ప‌టివ‌ర‌కు 6054 కోట్లు న‌ష్టం జ‌రిగింద‌ని అధికారులు అంచెనా వేసారు. వ‌ర్షం వ‌ల్ల వ్య‌వసాయ రంగానికి రూ.1353 కోట్లు న‌ష్టం చేకూరింద‌ని అంచెనా వేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: