త‌న‌కు ప‌రిచ‌యం అయిన ఆంటి మాట్లాడ‌డం లేద‌ని ఓ యువ‌కుడు ఆత్మ‌హ‌త్య చేసుకుని మృతి చెందాడు.  ఈ ఘ‌ట‌న హైద‌రాబాద్ న‌గ‌రంలోని బోయిన్‌ప‌ల్లి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. సీఐ ర‌వికుమార్  వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. బ‌ల్కంపేట‌కు చెందిన పి.దుర్గేష్ (31) రెండు సంవ‌త్స‌రాల కాలం నుంచి ఓల్డ్ బోయిన్‌ప‌ల్లిలోని మైత్రివ‌నం రాంరెడ్డి కాల‌నీలో నివాసం ఉంటున్నాడు. ఎల‌క్ట్రిష‌య‌న్‌గా దుర్గేష్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

ఇదే స‌మ‌యంలో అదే ఇంటికి సంబంధిన ఓ ఆంటితో త‌న‌కు ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఆంటి ఎప్పుడూ దుర్గేష్‌తో మాట్లాడుతుండేది. ఉన్న‌ట్టుండి ఆంటీ దుర్గేష్‌తో మాట్లాడ‌డం బంద్ చేయ‌డంతో దుర్గేష్ మ‌న‌స్థాపానికి గుర‌య్యాడు. ఆంటి వాళ్ల ఇంట్లో ఏప‌ని ఉన్నా దుర్గేష్‌తో చేయించుకునేది, ఆక‌స్మాత్తుగా ఏసీకి సంబంధించిన రిఫెయిర్ వేరే ఎల‌క్ట్రిషియ‌న్‌ను పిలిపించి చేయించ‌డంతో దుర్గేష్ మ‌న‌స్థాపానికి గుర‌య్యాడు. ఇన్ని రోజులు త‌న‌తో ఎప్పుడూ మాట్లాడే ఆంటీ ఎందుకు మాట్లాడ‌డం లేద‌ని డైలామాలో ప‌డ్డాడు. ప‌లుమార్లు మాట్లాడ‌డానికి ప్ర‌య‌త్నించినా కానీ ఆ ఆంటీ నిరాక‌రించింది.
 
గురువారం సాయంత్రం దుర్గేష్ మ‌హిళ ఇంటికి వెళ్లి మొద‌టి అంత‌స్తులోని వారి బెడ్ రూంలోకి వెళ్లి త‌లుపులు పెట్టుకుని త‌న చొక్కాతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దుర్గేష్ త‌ల్లి ఫిర్యాదు మేర‌కు బోయిన్‌ప‌ల్లి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: