సాధారణంగా మేకలు, గొర్రెలను మందగా అమ్మితే ఒక ధ‌ర రావ‌డం.. విడివిడిగా అమ్మితే మ‌రొక ధ‌ర ఉంటుంటుంది. ఎంత ఉ‍త్తమ జాతికి చెందిన మేక అయినా.. గొర్రె అయినా  మహా అయితే  లక్ష రూపాయలు ఖరీదు చేస్తుందేమో అనుకుంటారు.  కానీ ఓ  మేకపోతు అన్నిటికంటే చాలా ప్రత్యేకమైంది.  ప్రపంచంలోనే అత్యధిక ధర పలికి రికార్డు సృష్టించిన‌ది ఈ మేకపోతు.  ఆస్ట్రేలియాలోని మర్రకేశ్‌  అనే మేక గతంలో ఉన్న రికార్డుల‌ను బ్రేక్ చేసి తాజాగా వార్తల్లో నిలిచింది.

ఆస్ట్రేలియాలో మర్రకేష్ అనే మేక అత్య‌ధిక‌ మొత్తంలో $21,000కి విక్ర‌యించారు. దాదాపు 21 వేల డాలర్లు అంటే మన దేశ కరెన్సీలో రూ. 15,64,983 ధర పలికిన‌ది.   మర్రకేశ్‌ అనే పేరు కలిగిన ఈ మేకపోతు ప్రపంచలోనే అత్యంత ఖరీదైనదిగా నిలిచి చరిత్ర సృష్టించింది.  పశ్చిమ న్యూ సౌత్ వేల్స్ పట్టణంలోని కోబార్‌లో నవంబర్‌ 25న ఈ మేకపోతు అమ్మకం కోసం వచ్చింది. ఈ మేకపోతును ఆస్ట్రేలియాకు చెందిన ఆండ్రూ మోస్లీ అనే వ్యక్తి కొనుగోలు చేసాడు. ఈ మేక పోతు చాలా అందంగా,దృఢంగా ఉండ‌డ‌మే కాకుండా.. మరీ అంత‌ పెద్దగా కాకుండా.. అంత చిన్న‌గా కాకుండా  మధ్యస్థంగా ఉన్న‌ ఈ మేక పోతు చాలా త్వరగా పెరుగుతొంది. త్వరగా మందతో కలిసిపోతుందని  మోస్లీ వెల్ల‌డించాడు . గతంలో ఆస్ట్రేలియాలో ఓ మేక 12 వేల డాలర్లు పలకగా.. తాజాగా మర్రకేస్‌ ఆ రికార్డును బ్రేక్‌ చేసి ప‌న్నెండు కాస్త రివ‌ర్స్‌గా 21 వేల డాల‌ర్ల‌కు చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: