ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ప్ర‌భుత్వం టీచ‌ర్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పై ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న‌టువంటి 164 మోడ‌ల్ స్కూళ్ల‌లో ప‌ని చేస్తొన్న ప్రిన్సిపల్స్, టీచ‌ర్ల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సు 58 ఏండ్ల నుంచి 60 ఏండ్ల‌కు పెంచడానికి ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతూ నిన్న శుక్ర‌వారం ఉత్త‌ర్వుల‌ను జారీ చేసిన‌ది.

అయితే ఈ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంచ‌డంపై మోడ‌ల్ స్కూళ్ల ప్రొగ్రెసివ్ టీచ‌ర్స్ అసోసియేష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గౌర‌వ అధ్య‌క్షుడు ఒంటేరు శ్రీ‌నివాసులు రెడ్డి, రాష్ట్ర అధ్య‌క్షుడు కోమిటిరెడ్డి శివ‌శంక‌ర్‌రెడ్డి, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జి.చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి సీఎంకు కృత‌జ్ఞ‌త‌లు ప్ర‌క‌టించారు. అదేవిధంగా ఏపీ మోడ‌ల్ స్కూళ్ల టీచర్స్ యూనియ‌న్ రాష్ట్ర అధ్య‌క్షులు మోహ‌న్‌రెడ్డి, ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శిలు, మార్కెండేయా హ‌నుమంత‌రావులు హ‌ర్శం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు వెల్ల‌డించారు. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు 58 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వ‌ర‌కు పెంచ‌డంతో ఎంతో మంది ఉపాధ్యాయుల‌కు ఇది ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని  వారు పేర్కొన్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: