కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన సాగు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డంతో రైతులు ఆందోళ‌న‌ను విర‌మించాల‌ని ఇవాళ కేంద్రం రైతు ఉద్య‌మ నేత‌, భార‌తీయ కిసాన్ యూనియ‌న్ ప్ర‌తినిధి రాకేష్ టికాయ‌త్‌కు లేఖ రాసింది. సాగు చ‌ట్టాలను రద్దు చేసినందున ఆందోళ‌న‌ను విర‌మించాల‌ని కేంద్రం కోరింది. ఇటీవ‌ల రైతుల‌కు క్ష‌మాప‌ణ చెప్పిన ప్ర‌ధాని.. పార్ల‌మెంట్ శీతాకాల స‌మావేశాలు ప్రారంభ‌మైన తొలిరోజే ఉభ‌య స‌భ‌ల్లో ఆమోదింప‌జేసారు. రైతులంద‌రూ ఇండ్ల వ‌ద్ద‌కు వెళ్లిపోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం లేఖ‌లో సూచించిన‌ది.  

2020 న‌వంబ‌ర్ 25న ముఖ్యంగా పంజాబ్‌, హ‌ర్యానా నుంచి వేలాది మంది రైతులు ఛ‌లో ఢిల్లీ పేరిట ఆందోళ‌న చేప‌ట్ట‌డంతో.. పోలీసులు వారిని అడ్డుకోవ‌డంతో రాజ‌ధాని స‌మీపంలోనే భైరాయించి.. స‌రిహ‌ద్దుల నుంచే రైతు ఉద్య‌మం కొన‌సాగుతున్న‌ది. సాగు చ‌ట్టాల‌ను పార్ల‌మెంట్‌లో ర‌ద్దు చేస్తున్న‌ట్టు ప్ర‌ధాని ప్ర‌క‌టించిన విధంగానే ర‌ద్దు చేయ‌డంతో రైతు సంఘాల నేత‌లు కాస్త హ‌ర్షం వ్య‌క్తం చేసారు. రేపో మాపో రైతు సంఘాల నేత‌లు ఇండ్ల వ‌ద్ద‌కు చేరే అవ‌కాశం క‌నిపిస్తోంది. కేంద్ర‌ప్ర‌భుత్వం టికాయ‌త్‌కు లేఖ ద్వారా కోర‌డంతో ఈ వార్త ఇప్పుడు సంచ‌ల‌నంగా  మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: