ఓ వైపు అమరావతి రైతులకు మద్దతు ప్రకటిస్తూ మరోవైపు రాయలసీమ ఉద్యమానికి ఏ విధంగా మద్దతు పలుకుతారంటూ మధును ప్రశ్నించారు రాయలసీమ ప్రజా సంఘాల ప్రతినిధులు.
ఈ తరుణంలోనే కొద్దిసేపు మధుతో వాగ్వీవాదానికి దిగారు సీమ ప్రజా సంఘాల నాయకులు. దీంతో ఆ సభ నుంచి అర్థాంతరంగా బయటకెళ్లారు మధు. ఇటీవల అమరావతినే రాజధానిగా కొనసాగించాలని.. రైతులకు న్యాయం చేయాలని రైతులు తలపెట్టిన పాదయాత్రకు సీపీఎం మద్దతు ఇస్తుందని మధు స్పష్టం చేసిన విషయం విధితమే. అమరావతి రైతులకు మద్దతు పలికి.. ఏపీ సీఎం జగన్ పై సీపీఎం నేత మధు మండిపడ్డ విషయం అందరికీ తెలిసినదే. ఈతరుణంలోనే రాయలసీమ ఉద్యమనాయకులు మధుపై కాస్త ఆగ్రహం అయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి