రంగస్థలం తరువాత సుకుమార్.. అలా వైకుంఠపురంలో తరువాత అల్లుఅర్జున్.. ఇలా వీరిద్ధరి కాంబేషన్‌లో ఈ చిత్రం రావడంతో.. అభిమానులు భారీ అంచెనాలు పెట్టుకున్నారు. విడుదలకు ముందే కొన్ని చోట్ల ప్రీమియర్ షోలకు అనుమతి కూడా ఇచ్చారు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో పశ్చిమగోదావరి జిల్లాలో పుష్ప సినిమాకు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి లభించింది. పెరిగిన టికెట్ ధరలతు తాజాగా బుకింగ్‌ను ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణలో అన్నీ చోట్ల పుష్ప సినిమాకు డిసెంబర్ 17 నుంచి 30 వరకు సినిమా టికెట్ల ధరలను పెంచిన విషయం విధితమే. అయితే ఇక పశ్చిమగోదావరి జిల్లాలో ₹250, ₹200, ₹120 & ₹70 ధరలు ఉండనున్నాయి. స్థానిక అధికారులు అనుమతిస్తే హైకోర్టు రేట్లను పెంచవచ్చు. ఇది కేవలం వ్యక్తిగత జిల్లా జాయింట్ కలెక్టర్ వరకు అమలులో ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి