ద‌క్షిణాఫ్రికాలో పుట్టిన క‌రోనా నూత‌న వేరియంట్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు ప్ర‌జ‌ల‌ను క‌ల‌వ‌ర‌పెడుతూనే ఉంది. భార‌త్‌లో కూడా రోజు రోజుకు మెల్ల‌మెల్ల‌గా విజృంభిస్తుంది. ఇక తెలంగాణ‌లో క్ర‌మ‌క్ర‌మంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. నిన్న‌శ‌నివారం ఒక్క‌రోజే 12 కొత్త కేసులు న‌మోదు అవ్వ‌డం విశేషం. నూత‌న వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి  చెందుతున్న త‌రుణంలో.. నివార‌ణ‌కు చ‌ర్య‌లకు పూనుకుంటున్నాయి ప‌లు దేశాలు.

అయితే ఇప్ప‌టికే చాలా దేశాలు  కొన్ని క‌ఠినమైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.  కేసుల తీవ్ర‌త మ‌రింత పెరుగుతుండ‌టంతో.. మ‌ళ్లీ మాస్క్ త‌ప్ప‌నిస‌రిగ్గా ధ‌రించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌నిస‌రిగా వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని.. ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గుమిగూడ‌కుండా ప‌లు కార్య‌క్ర‌మాల‌పై ఆయా ప్ర‌భుత్వాలు ఆంక్ష‌లు కూడా విధిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే నెద‌ర్లాండ్ ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. క్రిస్మ‌స్ సంద‌ర్బంగా ప్ర‌జ‌లు ఎక్కువ‌గా గుమికూడే అవ‌కాశం ఉండ‌డంతో.. లాక్ డౌన్ విధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఒమిక్రాన్ క‌ట్ట‌డిలో నిర్వ‌హిస్తున్న లాక్‌డౌన్ ఇవాల్టి నుంచి జ‌న‌వ‌రి రెండవ వారం వ‌ర‌కు అమ‌లులో ఉంటుంద‌ని ఆదేశ ప్ర‌ధాని మార్క్ రూట్ వెల్ల‌డించారు. ఈ స‌మ‌యంలో నిత్యావ‌స‌రాలు, అత్య‌వ‌స‌ర సేవ‌ల‌కు మిన‌హాయింపు ఇవ్వ‌నుండ‌గా.. ఇత‌ర దుకాణాలు, బార్లు, జిమ్‌లు, క్షౌర‌శాల‌లు, బహిరంగంగా జ‌రిగే కార్య‌క్ర‌మాల‌న్నింటిని నెద‌ర్లాండ్ ప్ర‌భుత్వం బంద్ చేయ‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: