మార్చి 28, 29 తేదీల్లో బంద్ జరగబోతోంది. ఇది దేశం మొత్తం జరగనున్న సార్వత్రిక సమ్మె.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని ట్రేడ్‌ యూనియన్లు ఈ బంద్‌కు పిలుపు ఇచ్చాయి. ఈ బంద్‌కు.. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు అనేక ప్రజాసంఘాలు కూడా మద్దతు పలుకుతున్నాయి. తాజా పలువురు ప్రజాసంఘాల నేతలు బంద్‌కు మద్దతు తెలుపుతూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌కేవీ కార్మిక విభాగం కూడా సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సార్వత్రిక సమ్మె విజయవంతానికి అన్ని ట్రేడ్‌ యూనియన్లతో ఇప్పటికే మంత్రుల నివాసంలోని క్లబ్‌ హౌజ్‌లో తెలంగాణ రాష్ట్ర సన్నాహక సదస్సు నిర్వహించారు కూడా. పీఎస్‌యూల ప్రైవేటీకరణ, కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక చర్యలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామని నేతలు చెబుతున్నారు. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరించాలని నిర్ణయించడం దారుణం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: