భక్తులకు శుభవార్త.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కాబోతోంది. జమ్మూకాశ్మీర్‌లోని పవిత్ర అమర్‌నాథ్‌ యాత్ర ఈ ఏడాది జూన్‌ 30న ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు జమ్మూకాశ్మీర్‌ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా  నేతృత్వంలోని శ్రీ అమర్‌నాథ్‌ జీ ఆలయ బోర్డు నిర్ణయం ప్రకటించింది. ఈ ఏడాది ఈ అమర్‌నాథ్ యాత్ర 43 రోజుల పాటు సాగుతుంది. కొవిడ్‌కు సంబంధించిన అన్ని నిబంధనలతో ఈ యాత్రను నిర్వహించనున్నట్టు జమ్మూకాశ్మీర్ గవర్నర్ మనోజ్‌ సిన్హా  తన సామాజిక మాధ్యమాల్లో ఈ శుభవార్త ప్రకటించారు. 2019లో ఆగస్టులో ఆర్టికల్‌  370ని రద్దు చేయడానికి ముందు ఆ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రను శాంతి భద్రతల కారణంగా రద్దు చేశారు. ఆ తర్వాత కరోనా వచ్చి.. రెండేళ్లు ఏదో నామమాత్రంగా యాత్ర నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు మూడేళ్ల తర్వాత ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్ర పూర్తి స్ధాయిలో నిర్వహించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: