ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాళ్టి నుంచి ఏపీలో ఒంటి పూట బడులు ప్రారంభం కానున్నాయి. వేసవి తీవ్రత దృష్ట్యా ఈ ఉదయం నుంచి ఒక్కపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కపూట బడుల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఒకటి నుంచి 10వ తరగతి వరకు అన్ని పాఠశాలల్లో ఒక్కపూట బడులు నిర్వహిస్తారు. ఉదయం 7.30 నుంచి ఉ.11.30 వరకు  పాఠశాలలు పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈనెల 27 నుంచి ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. అందువల్ల పదోతరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సూచనలు చేసింది. ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటి పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు కాస్త ఎండ నుంచి ఊరట కలగనుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: