బై బై వైఎస్ జగన్.. ఇప్పుడు ఈ పదాన్ని జనసేన సోషల్ మీడియా గ్రూప్‌ టార్గెట్ చేసింది. అందుకే బై బై వైఎస్ జగన్ అనే హ్యష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో బై బై వైఎస్ జగన్ అనే పదం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ పదంతో ఇప్పుడు జనసేన సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఇటీవల జగన్ సర్కారు విద్యుత్ చార్జీలు పెంచింది. దీనికి తోడు తాజాగా కరెంట్‌ కోతలు అమలు చేస్తోంది. ఇప్పుడు పవర్ హాలీడే కూడా ప్రకటించింది. దీనికి తోడు పెట్రోల్, డీజిల్ రేట్లు కూడా మండిపోతున్నాయి. దీంతో.. ఇంత అరాచకంగా పాలిస్తున్న జగన్‌కు గుడ్ బై చెబుదామంటూ జనసేన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతోంది. దీంతో ఈ పదం ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. సీపీఎస్‌ రద్దు, మద్య నిషేధం వంటి హామీలు కూడా జగన్ అమలు చేయలేదని జనసేన విమర్శిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: