పొరుగు దేశం ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే.. ఉక్రెయిన్ రష్యా మధ్య శాంతి కోసం కూడా చర్చలు జరుగుతున్నాయి. అయితే.. ఇప్పటికే ఒకటి, రెండు సార్లు సమావేశమైన ఉక్రెయిన్, రష్యా ప్రతినిధులు.. సమస్యను మాత్రం పరిష్కరించలేకపోయారు. అయితే మరోసారి చర్చలకు సిద్ధం అని రెండు దేశాలు ఇప్పటికే ప్రకటించారు. ఈసారైనా శాంతి చర్చలు ఫలిస్తాయా అన్న సందేహం నెలకొంది.


ఇలాంటి సమయంలో రష్యా ఓ కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌తో తదుపరి చర్చల సమయంలో దాడులు మాత్రం ఆపేది లేదంటోంది రష్యా.  చర్చలను కొనసాగించకపోవడానికి తనకు ఎటువంటి కారణాలూ కనిపించడం లేదన్న విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌... మళ్లీ సమావేశమైనప్పుడు మాత్రం రష్యా తన ప్రత్యేక సైనిక ఆపరేషన్‌ను నిలిపివేయదన్నారు. గతంలో చర్చల సందర్భంగా సైనిక చర్య నిలిపివేతకు పుతిన్ ఆదేశించారని లావ్రోవ్ చెప్పారు. కానీ.. ఈసారి తమ వైఖరి మారిందని రష్యా అంటోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: