ఏపీలో ఆయిల్‌ పామ్ రైతులు, ఫ్యాక్టరీల యాజమాన్యాలకు ఆమోద యోగ్యంగా ఉండేలా ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రకటన చేశారు. ఏపీలో సీజన్ ప్రారంభానికి ముందే ఆయిల్ ఫామ్ ధరలను నిర్ణయిస్తామని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. ఆయిల్ ఫామ్ ధరల విషయంలో ఇటు రైతులు అటు ఫ్యాక్టరీల యాజమాన్యాలు నష్టపోకుండా అందరికీ ఆమోద కరమైన రీతిలోనే ధరల్ని నిర్ణయిస్తామని మంత్రి కాకాణి తెలిపారు. నూనె శాతాన్ని శాస్త్రీయ విధానంలోనే అనుసరించి ధరల నిర్ణయం చేస్తామని మంత్రి కాకాణి స్పష్టం చేశారు. ఏపీకి ఫ్యాక్టరీలు రావాలి ఉపాధి అవకాశాలు పెరగాలని ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి కాకాణి పేర్కొన్నారు.డ్రిప్ ఇరిగేషన్ కు సంబంధించి పెద్దఎత్తున రిజిస్ట్రేషన్లు చేపట్టాల్సిందిగా అధికారులకు మంత్రి కాకాణి ఆదేశాలు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: