జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు శుభవార్త.. చాలా చోట్ల ఈ పథకం కింద పని చేసిన కూలీలకు డబ్బులు సరిగ్గా రావడంలేదు. అదేమంటే ఇంకా ఫండింగ్ రాలేదని చెబుతున్నారు. అయితే.. ఇప్పుడు ఏపీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకంలో పని చేస్తున్న వేతనదారుల చెల్లింపుల కోసం నిధులు విడుదల అయ్యాయి.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం రూ.685.12 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబంధించి గడిచిన నాలుగు రోజుల్లో ఏపీ రాష్ట్ర నోడల్ ఖాతాకు రూ. 622 కోట్లు విడుదల అయ్యాయి. ఈ మొత్తంలో  గడిచిన రెండు రోజుల్లో రూ. 302.96 కోట్లు వేతనదారుల ఖాతాలకు నేరుగా జమ అయ్యాయి. ఇంకా మిగిలిన రూ.319 కోట్లు కూడా రాబోతున్నాయి. అవి వచ్చే రెండు మూడు రోజుల్లో వేతనదారుల ఖాతాలకు నేరుగా జమ కానున్నాయి. ఈ మేరకు ఏపీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్  కోన శశిధర్ మీడియాకు తెలియ జేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: