కరోనా కాలం తర్వాత మళ్లీ దేశ ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోంది. దేశంలో వస్తు, సేవల పన్ను.. అదేనండీ జీఎస్టీ వసూళ్ల జోరు కొనసాగుతోంది. మే నెలలో జీఎస్టీ ఎంత వసూలైందో తెలుసా.. ఏకంగా లక్షా 40 వేల 885 కోట్ల రూపాయల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గత ఏడాది మే నెలతో పోలిస్తే జీఎస్టీ 44 శాతం వృద్ధి నమోదైనట్లన్నమాట. అసలు జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ రేంజ్‌లో పన్ను వసూళ్లు ఇది కేవలం నాలుగో సారి మాత్రమే. అంటే లక్షా 40 వేల కోట్ల మార్క్ దాటడం ఇది నాలుగోసారి అన్నమాట.


ఇక ఈ జీఎస్టీ వసూళ్లు లక్షా 40వేల 885 కోట్లలో సెంట్రల్‌ జీఎస్టీ 25 వేల 36 కోట్లు అయితే.. స్టేట్ జీఎస్టీ 32వేల కోట్ల రూపాయలు. ఇక ఐజీఎస్టీకింద 73వేల 345 కోట్లు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఐజీఎస్టీలో 37వేల 469 కోట్లు వస్తువుల దిగుమతి కారణంగా వచ్చింది. ఇవి కాకుండా సెస్‌ కింద 10వేల 502 కోట్లు వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: