మన దాయాది దేశం పాకిస్తాన్‌ పరిస్థితి ఆర్థికంగా దిగజారుతోంది. రోజు రోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. ఒక దేశ ఆర్థిక పరిస్థితిని ఆ దేశ విదేశీ మారక ద్రవ్య నిల్వలతో అంచనా వేయవచ్చు. అలా చూస్తే.. పాకిస్తాన్ విదేశీ మారక ద్రవ్యం నిల్వలు బాగా తగ్గిపోయాయి.. ఫిబ్రవరిలో 16 వందల కోట్ల డాలర్లుగా ఈ నిల్వలు ఉన్నాయి. అదే జూన్ మొదటి వారానికి వెయ్యి కోట్ల డాలర్లకు పడిపోయాయి.


ఈ మొత్తం.. పాకిస్తాన్‌ దేశం చేసుకునే దిగుమతులన్నటికీ రెండు నెలల చెల్లింపులకు మాత్రమే సరిపోతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే ఈ నిధులను పొదుపుగా వినియోగించే ప్రయత్నంలో భాగంగా గత నెలలో లగ్జరీ వస్తువుల దిగుమతిని ప్రభుత్వం నిలిపివేసింది. కేవలం నిత్యావసర వస్తువులనే దిగుమతి చేసుకోవాలని పాక్‌ నిబంధన విధించింది. అలాగే విద్యుత్‌ను ఆదా చేసేందుకు వ్యాపారాలు, దుకాణాలు, స్టాల్స్‌ను రాత్రి 8.30కు మూసేయాలని పాక్‌ ప్రభుత్వం ఆదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: