నా రొమ్ముల గురించి గర్వపడుతున్నానంటూ శ్రీలంక పార్లమెంటు మాజీ సభ్యురాలు హిరుణికా ప్రేమచంద్ర చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. అలా ఆమె ఎందుకు మాట్లాడారంటే.. శ్రీలంకలో ఇటీవల జరిగిన ఒక నిరసన సమయంలో హిరుణికను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఆ సమయంలో ఆమె వక్షోజాలు బయటకు కనిపించాయంటూ కొందరు ఎగతాళి చేశారు. ఆ ఫోటోలతో సోషల్ మీడియాలో మీమ్స్ సృష్టించి ట్రోల్‌ చేశారు.

దీంతో ఆగ్రహించిన  శ్రీలంక పార్లమెంటు మాజీ సభ్యురాలు హిరుణికా ప్రేమచంద్ర... దీని గురించి ఫేస్‌బుక్‌లో సుదీర్ఘంగా స్పందించారు. తన రొమ్ముల గురించి నేను గర్వపడుతున్నన్న హిరుణికా ప్రేమచంద్ర .. ఆ రొమ్ములతోనే ముగ్గురు అందమైన పిల్లలకి పాలిచ్చి పెంచానన్నారు. ముగ్గురు పిల్లలను జాగ్రత్త పెంచి పోషించానని.. నా శరీరం మొత్తాన్ని వాళ్లకు అంకితమిచ్చానని వ్యాఖ్యానించారు. తన రొమ్ములు బయటకు కనిపించడం గురించి వెకిలి రాతలు రాసినవారు కూడా తల్లి దగ్గర చనుబాలు తాగే ఉంటారని వ్యంగ్యంగా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: