హైదరాబాద్‌లో జరుగుతున్న నేరాల్లో ఆఫ్రికన్ల పాత్ర ఎక్కువగా ఉంటోంది. ప్రత్యేకించి డగ్స్ సరఫరా, సైబర్ నేరాల్లో హైదరాబాద్‌లో తిష్టవేసిన ఆఫ్రికన్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్ లో వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న ఆఫ్రికన్ దేశస్థులు నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్  తెలిపారు.

ఇలాంటి ఓ ఐదుగురిని వారి దేశానికి పంపిస్తున్నారు. ఎఫ్ఆర్ఆర్ఓ కి సమాచారం ఇచ్చి ఎంబసీ ద్వారా వారిని సొంత దేశాలకు పంపిస్తున్నామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్  తెలిపారు. హైదరాబాద్ లో ఉంటూ పలువురికి వీరు సమస్యలు గా మారుతున్నారని.. అందుకే కొంతమందిని  పంపేందుకు తామే విమాన టికెట్లను కూడా బుక్ చేశామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్  తెలిపారు. హైదరాబాద్ లో 2500 మంది ఆఫ్రికన్లు ఉంటే అందులో వీసా గడువు ముగిసిన వారు  750కి పైగా ఉన్నారు. త్వరలో మిగిలిన వారికి కూడా ఇక్కడి నుంచి పంపిస్తామన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: