రాష్ట్రం మరో శ్రీలంక కావటం ఖాయమని.. శ్రీలంకలో ఉన్న దుర్భర పరిస్థితులు ఇప్పటికే ఏపీలో అమలవుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అంటున్నారు. అందుకు కొన్ని సంఘటనలు ఉదహరిస్తున్నారు. పనిచేసే ఉద్యోగులకు ఎప్పటి నుంచో సకాలంలో జీతాలు చెల్లించట్లేదని చంద్రబాబు గుర్తు చేశారు. జీపీఎఫ్ కూడా విత్ డ్రా చేసుకునే పరిస్థితి వారికి లేదనీ..., పదవీ విరమణ చేసినవారికి చేయాల్సిన చెల్లింపులు కూడా సక్రమంగా చేయట్లేదని చంద్రబాబు  విమర్శించారు.


కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించే పరిస్థితి లేదన్న చంద్రబాబు...., చేసిన అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేస్తున్నారన్నారు. మలధన వ్యయం ఎక్కడా లేకపోవటంతో అభివృద్ధి కుంటబడిందని చంద్రబాబు  మండిపడ్డారు. రహదారులకు మరమ్మతులు కూడా లేవని ఆగ్రహం చంద్రబాబు  వ్యక్తం చేశారు. ఇవన్నీ శ్రీలంక లాంటి పరిస్థితులు కాదా అని చంద్రబాబు  ప్రశ్నించారు. పోలవరం నిర్లక్ష్యం ఎవరిదో కేంద్రమే నిర్ధారించిందన్న చంద్రబాబు...., రాష్ట్ర ప్రభుత్వం పోలవరం విషయంలో తమ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు తెలుగుదేశంపై ఎదురుదాడి చేస్తోందన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: