అమెరికాలో తుపాకీ సంస్కృతి రోజురోజుకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.. ఎక్కడో ఎవరో కాల్పులు జరపడం.. అమాయకులు చనిపోవడం వంటి వార్తలు తరచూ అమెరికా మీడియాలో సాధారణంగా మారాయి. అందుకే.. ఈ గన్ కల్చర్‌ను తుదముట్టించేందుకు అమెరికా ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. సెమీ ఆటోమేటిక్ గన్‌లపై తిరిగే నిషేధం విధించేందుకు ప్రయత్నిస్తోంది. 



ఇందుకు ఉద్దేశించిన బిల్లును అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి ఈ బిల్లును ప్రతిపాదించగా.. డెమోక్రాట్ల మెజారిటీ ఉన్న ప్రతినిధుల సభలో  ఈ బిల్లు ఆమోదం పొందింది. అయితే.. ఇద్దరు రిపబ్లికన్‌లు మాత్రం ఇద్దరే ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. దీంతో ఈ  సెమీ ఆటోమేటిక్ గన్‌ నిషేధ బిల్లు సెనేట్‌లో పాక్ కాకపోవచ్చని అంటున్నారు. ఈ బిల్లు చట్టం రూపంలోకి రావాటంటే.. రిపబ్లికన్ల మద్దతు చాలా అవసరం. మరి ఈ బిల్లు భవితవ్యం ఏమవుతుందో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: