ఏపీలోని కొన్ని నగరాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు కొత్త వైద్య సౌకర్యాలు అందుబాటులోకి రాబోతున్నాయి. విజయవాడ, అనంతపురం, కాకినాడ, గుంటూరు ఆస్పత్రుల్లో 4 లైనాక్‌ మెషీన్ల ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. శ్రీకాకుళం, నెల్లూరు, ఒంగోలు ఆస్పత్రుల్లో బంకర్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.  మరో 7 పాత మెడికల్‌ కాలేజీల్లో కేన్సర్‌ శస్త్ర చికిత్సలు కోసం ఆపరేషన్‌ ధియేటర్ల అప్‌గ్రడేషన్, పాథాలజీ డిపార్ట్‌మెంట్లలో ఆధునిక సౌకర్యాలు, కీమో థెరపీ,డ్రగ్స్‌ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.  


ప్రతి టీచింగ్‌ ఆస్పత్రి ఆ జిల్లాకు సంబంధించిన వైద్యకార్యకలాపాలకు కేంద్రంగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. విలేజ్‌ క్లినిక్స్‌ దగ్గర నుంచి ఆ ఏరియాలో ఉన్న ప్రతి ఆస్పత్రి  బోధనాసుపత్రి పరిధిలోకి తీసుకురానున్నారు. దీనివల్ల క్యాన్సర్‌లాంటి వ్యాధులను గుర్తించడం, వైద్యం  అందించడం సులభతరమవుతుంది. వైయస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌లోకి 12రకాల రాపిడ్‌ డయాగ్నోస్టిక్స్‌ కిట్లు, 67 రకాల మందులు అందుబాటులో ఉంచనున్నారు. విలేజ్‌ క్లినిక్స్‌ విధివిధానాల్లో పారిశుద్ధ్యం మరియు తాగునీటి నాణ్యతపై ప్రతినెలా  నిరంతర పరిశీలన, నివేదికలు పంపనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ggh