సమంత ఉన్నట్టుండి మళ్లీ అనారోగ్యం బారినపడి హాస్పిటల్లో జాయిన్ అవ్వడంతో ప్రతి ఒక్కరు ఆమెకేమైంది అని తెలుసుకోవడానికి తెగ కంగారుపడుతున్నారు. ఏదిఏమైనా సమంత త్వరగా ఆ జబ్బు నుంచి కోలుకొని.. మళ్ళీ మామూలు పొజిషన్ కి రావాలని కోరుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని చెప్పవచ్చు. మరి సమంత కెరియర్ విషయానికి వస్తే ఇన్ని రోజులు తెలుగు , తమిళ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించింది . ఈ క్రమంలోనే అక్కడ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇస్తోంది.
ప్రస్తుతం ఈమె నటించిన యశోద సినిమా విడుదలవగా త్వరలోనే శాకుంతలం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. యశోద సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సమంత.. శాకుంతలం సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి. ఇదిలా ఉండగా అనారోగ్య పరిస్థితులతో ఇబ్బంది పడుతున్నప్పటికీ.. ఆమె సినిమా సక్సెస్ కోసం ప్రమోషన్ లో భాగం కావడంతో ఆమెపై పలువురు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.సమంత కెరియర్ విషయానికి వస్తే.. త్వరలోనే యశోద 2, యశోద 3 చిత్రాలను తెరకెక్కించడానికి దర్శకుడు హరి హరీష్ సన్నాహాల సిద్ధం చేస్తున్నారు.