తెలంగాణలో కేసుల రాజకీయాలు మరింత ముదురుతున్నాయి. బీజేపీ జాతీయ నేత బీఎల్‌ సంతోష్‌ను జైల్లో పెట్టించాలని టీఆర్ఎస్‌ సర్కారు ప్రయత్నిస్తోంది. దీనికి ప్రతిగా అన్నట్టు టీఆర్‌ఎస్‌ నేత, కేసీఆర్ కూతురు కవితను అరెస్టు చేయించే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పుడు మీడియాలో కవిత, ..బిఎల్ సంతోష్ వార్తలే కనిపిస్తున్నాయి. కవిత మీద లిక్కర్ కుంభకోణం ఉంటే.. బిఎల్ సంతోష్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఉంది.. దీంతో కేంద్ర, రాష్ట్ర రెండు స్కామ్ ల ప్రభుత్వాలే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
 

బీజేపీ కవితపై ఐటీ, ఈడీ, సీబీఐ కేసులు పెట్టింది.. కవిత లిక్కర్ కేసులో ఉండటం వల్ల అరెస్ట్ చేస్తాం అని కేంద్రం సంకేతాలిస్తోంది.. అటు బిఎల్ సంతోష్ పై ఎమ్మెల్యేలను కొనే కేసు పెట్టింది కేసీఆర్ సర్కారు.. కవిత, బిఎల్ సంతోష్ లను ఇద్దరూ నెరగాళ్లేనని.. ఇద్దరిని వెంటనే అరెస్టు చేయాలి అని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: