తెలంగాణలో వచ్చే సాధారణ ఎన్నికల్లో పోటీ చేసేందుకు జనసేన పార్టీ రెడీ అవుతోంది. తెలంగాణలో 32 స్థానాలను పవన్ కల్యాణ్‌ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయా స్థానాల్లో  అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన కసరత్తు ప్రారంభించారు.  32 నియోజకవర్గాలకు కార్యనిర్వాహకుల నియామకాన్ని పూర్తి చేశారు. తెలంగాణలో పోటీకి సిద్ధంగా ఉండాలంటూ ఇటీవల పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ పిలుపు ఇచ్చారు.


తాజా ఎంపిక చేసిన నాయకులు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లో త్వరలో పవన్ కల్యాణ్‌ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. పవన్ పర్యటన సమయంలో అక్కడ పోటీ చేసే అభ్యర్థులను పవన్ డిసైడ్ చేయనున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి సంస్థాగత నిర్మాణం కోసం పనిచేసిన వారికి ఎక్కువగా అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంది. ఇప్పటికే 32 మంది పేర్లతో కూడిన కార్యనిర్వాహకుల జాబితాను జనసేన విడుదల చేసింది. మరి తెలంగాణలో పవన్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?


మరింత సమాచారం తెలుసుకోండి: