సినీ షూటింగులతో బిజీగా ఉండే నటి మంచు లక్ష్మి ఓ మంచి అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో డీప్ వీన్ త్రాంబోసిస్ గా చెప్పుకునే డీవీటీ సమస్య ఎక్కువవుతోందని నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు. కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన నడక కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ప్రారంభించారు. డీవీటీ సమస్య ఒక్కోసారి ప్రాణాంతకంగా మారుతుందని మంచు లక్ష్మి  అన్నారు. డీవీటీ పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కాళ్లలో వాపు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలని మంచు లక్ష్మి కోరారు.


హైదరాబాద్‌ నెక్లెస్ రోడ్ లో జరిగిన కార్యక్రమంలో మంచు లక్ష్మి సహా ఆస్పత్రి ఎండీ భాస్కర రావు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ భాస్కర రావు మాట్లాడుతూ రక్త నాళాల్లో .. ముఖ్యంగా కాళ్లలో రక్తం గడ్డలుగా మారి ఒక్కోసారి ఆ గడ్డలు రక్త నాళాల గుండి గుండెకు చేరే ప్రమాదం ఉందని అన్నారు. దీనివల్ల  గుండె పోటు సమస్యలు వచ్చి వ్యక్తులు మరణించే అవకాశం ఉందని డాక్టర్ భాస్కర్‌ రావు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: