తెలంగాణ రాష్ట్రంలోఎన్నికల అధికారులు ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభించారు. 34,891 మంది బూత్ స్థాయి అధికారుల శిక్షణ కోసం ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా స్థాయి మాస్టర్ ట్రైనర్లకు ఇవాళ జీహెచ్ఎంసీ కార్యాలయంలో శిక్షణ ఇచ్చిన అధికారులు.. ఓటర్ల జాబితా తయారీలో బీఎల్ఓలు, బీఎల్ఓ సూపర్ వైజర్ల పాత్ర, సంబంధిత అంశాలపై అవగాహన కల్పించారు.


ఈ నెల 18న అన్ని జిల్లాల్లో శాసనసభ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇస్తారు. 19వ తేదీ నుంచి 25 వరకు అన్ని మండలాల్లో బీఎల్ఓలకు శిక్షణ ఇస్తారు. బీఎల్ఓలకు అన్ని అంశాలపై సంపూర్ణంగా శిక్షణ ఇవ్వాలనిన సీఈఓ వికాస్ రాజ్ ఆదేశించారు. అందుకు అనుగుణంగా శాసనసభ నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇవ్వాలని సీఈఓ ఆదేశించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ల జాబితా సంబంధిత అంశాలపై బీఎల్ఓలకు సంపూర్ణంగా అవగాహన కల్పించాలని వికాస్ రాజ్ ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: