జగన్ అనే సింహాన్ని ఎదుర్కొనేందుకు గుంట నక్కలు, ఊర కుక్కలు ఒకటయ్యాయంటున్నారు ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్. చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు ఆంధ్ర రాష్ట్రంలో ఆధార్ కార్డు, ఇల్లు ఉందా అని మంత్రి జోగి రమేష్ ప్రశ్నించారు. రాజకీయాలు చేసేది, ఉండేది పక్కరాష్ట్రంలో విషం కక్కేది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల ప్రజలపైనా అని జోగి రమేష్ నిల‌దీశారు.

అమలాపురంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లకు దమ్ము, ఖలేజా ఉంటే సింగిల్‌ గానే పోటీ చేయాలని సవాల్ చేశారు. ఎన్నికల వేళ కుక్కలు, నక్కలు, పందులు కలిసి వస్తాయని.. సింహం మాత్రం సింగిల్ గానే వస్తుందని జోగి రమేష్ సినిమా డైలాగ్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: