కేరళలో అమలు జరుగుతున్న పంచాయతీ రాజ్ వ్యవస్థపై అధ్యయనం చేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ సూచిస్తున్నారు. ఏపీలో పంచాయతీ నిధులు దుర్వినియోగంపై కేంద్ర పెద్దలు కూడా చెప్పారని... కేంద్ర నిధులు నేరుగా గ్రామాలకు చేర్చి, దుర్వినియోగాన్ని కట్టడి చేస్తామని.. గ్రామీణ నిధులు మళ్లించడం దోపిడీగా చూడాలని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ఇటువంటి వాటిపై పెద్ద ఎత్తున ఉద్యమం జరగాలన్న పవన్‌ కల్యాణ్‌... గ్రామ సభలు నడిపేలా అందరూ కలిసి వచ్చేలా చైతన్యపరచాలన్నారు.


పంచాయతీలకే నిధులు వచ్చేలా మా వంతు కృషి చేస్తామన్న పవన్‌ కల్యాణ్‌.. 73,74 రాజ్యాంగ సవరణ ద్వారా గ్రామాలకు అధికారాలు ఇచ్చిందని.. మన రాజ్యాంగాన్ని పాలకులే అమలు చేయకపోతే ఎలాగని ప్రశ్నించారు. కేంద్రం నిర్దేశించిన బ్యాంకుల ద్వారా సర్పంచ్ లకే నిధులు రావాలని... నిధుల దుర్వినియోగాన్ని కేంద్ర జాతీయ నాయకత్వం దృష్టికి బలంగా తీసుకెళతామని పవన్‌ కల్యాణ్‌ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: