టీడీపీ నేత నారా లోకేశ్‌ పై మంత్రి అంబటి విరుచుకుపడ్డారు. ఏకంగా బఫూన్‌ గాడు అంటూ రెచ్చిపోయారు. తెనాలి రామకృష్ణుడు సత్తెనపల్లిలో పుట్టాడని లోకేశ్ మాట్లాడాడని.. ఇలాంటివి తెలుసుకుని మాట్లాడాలని.. అతను మాట్లాడుతుంటే పక్కన నిల్చున్న వారన్నా చెప్పాలి కదా అని అంబటి ఎద్దేవా చేశారు. ఇలాంటి బఫూన్‌ గాడు ఏదేదో మాట్లాడుతుంటే బొడ్డూడని బుడ్డోడు పక్కన కూర్చున్నట్టు పక్కనున్న పెద్దలంతా అలానే చూస్తే ఎలా అంటూ అంబటి రెచ్చిపోయారు. అలాంటి బఫూన్‌ వెంట తిరగడానికి మీరు సిగ్గు పడాలన్న మంత్రి అంబటి రాంబాబు... లోకేశ్‌ తప్పు మాట్లాడుతుంటే తప్పు అని చెప్పే ధైర్యమే చేయడం లేదన్నారు.


లోకేశ్‌ యాత్ర కుప్పంలో ప్రారంభం అయినప్పుడే.. ఎలుక తోలు తెచ్చి ఎన్నాళ్లు ఉతికినా నలుపు నలుపే కానీ తెలుపు రాదని తాను చెప్పానని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. లోకేశ్ సీరియస్‌ పోలిటీషయన్‌ కాదని ఆయన మళ్లీ మళ్లీ ఓడిపోవడం ఖాయమని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: