తెలంగాణ సచివాలయంలో కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్సీ విద్యార్ధులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ ల్యాప్ ట్యాప్ లు పంపిణీ చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో దేశంలోనే ఏ రాష్ర్టంలో లేని విధంగా గురుకుల విద్యావిధానాన్ని అభివృద్ధి చేశారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. తెలంగాణ గురుకుల పాఠశాలల్లో చదివిన విద్యార్ధులు ఐఐటీ, నిట్, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.


2022-23 సంవత్సరంలో ఐఐటీలో 62 మంది, నిట్, ట్రిపుల్ ఐటీల్లో 113 మంది విద్యార్ధులు, ఎంబీబీఎస్  205 మంది, ఇంజనీరింగ్ కాలేజీల్లో ఎనిమిది వందల మంది విద్యార్ధులు సీట్లు సాధించారని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. గతంలో ఒక్క కాలేజీ ఆఫ్ ఎక్సలెన్సీ(సీఓఈ) ఉండగా తెలంగాణ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత వాటి సంఖ్యను 38కి పెంచిందని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యావిధానాలు ఇతర రాష్ర్టాల ప్రతినిధుల బృందం సైతం వచ్చి పరిశీలించి వెళుతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: