చంద్రబాబును జగన్ సర్కారు అరెస్టు చేసింది. రిమాండ్‌లో పెట్టించింది. అయితే.. చంద్రబాబు అరెస్టుకు దారి తీసిన కారణాలు ఏంటి.. కేవలం జగన్ కక్ష సాధింపు కోసమే చంద్రబాబును జైల్లో పెట్టించాడా అన్న చర్చ జనంలో సాగుతోంది. చంద్రబాబు లండన్‌, ప్యారిస్‌ పర్యటనకు వెళ్లిన జగన్మోహన్‌ రెడ్డి కళ్లలో ఆనందం మెరిసిపోయి ఉంటుందని ఓ పత్రికాధిపతి రాసుకొచ్చారు.

నిజంగా అదే జరిగి ఉంటుందా.. తాను మాత్రమే అవినీతిపరుడిని కాదని, చంద్రబాబు కూడా అవినీతిపరుడే అని చెప్పడమే చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో జగన్‌ లక్ష్యం అన్నది నిజమేనా? ఇప్పుడు చంద్రబాబుకు కూడా అవినీతి మరక అంటించినందువల్ల ఇక జగన్మోహన్‌ రెడ్డి శాంతిస్తారా.. చంద్రబాబును అరెస్టు చేయడం వెనుక పగ, ప్రతీకారం తీర్చుకోవడమే కారణమా.. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబును జైలుకు పంపితే  రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని జగన్‌ భావించారా.. అన్న చర్చ జనంలో జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: