దసరా పండుగ సందర్బంగా తెలంగాణ ఆర్టీసీ అక్టోబర్ 13వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 11 రోజులపాటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపించిన సంగతి తెలిసిందే. తిరిగి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఈ సర్వీసులతో ఆర్టీసీ ఆదాయం గణనీయంగా పెరిగింది. సాధారణంగా ప్రతిరోజూ ఆర్టీసీకి సుమారు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. దసరా పండుగ సందర్బంగా ప్రతిరోజూ అదనంగా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు వచ్చింది.


అత్యధికంగా ఒకరోజు రూ.19 కోట్ల వరకు కూడా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఆర్టీసీకి గత 11 రోజుల్లో రూ.25 కోట్లకు పైగా అదనపు ఆదాయం సమకూరింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 10 రీజియన్లు ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ రీజీయన్.. ఇలా ఒక్కో రీజీయన్ కు సరాసరిగా సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: