స్కిల్‌ కేసులో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చేసింది. ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ వచ్చింది. ఆయన త్వరలో బెయిల్ పై విడుదల కాబోతున్నారు. ఇటీవల హైకోర్టు న్యాయమూర్తులు విచారించే కేసులకు సంబంధించిన (రోస్టర్) లను మారుస్తూ ఏపీ ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా నలుగురు జడ్జిలు రావడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాల మేరకు రోస్టర్ లో పలు మార్పులు చేశారు.

2019 నుంచి  దాఖలైన క్రిమినల్ రివిజన్ కేసులు, బెయిల్ పిటిషన్లు, మాజీ, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎంపీల కేసుల విచారణను జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు కు కేటాయించారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం దాఖలు చేసిన అనుబంధ పిటిషన్ జస్టిస్ మల్లికార్జునరావు వద్దకు విచారణకు వచ్చింది. వాదనల అనంతరం బాబుకు బెయిల్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: