ఇవాళ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భాజపా బీసి ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారు. దీనికి ప్రధాని మోది హాజరు కానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ సభకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. వెయ్యి మందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్న పోలీసులు.. ఎల్బీస్టేడియం పరిసర ప్రాంతాలను బాంబ్ స్క్యాడ్, డాగ్ స్వ్కాడ్ తో  క్షుణ్నంగా తనిఖీలు నిర్వహించారరు.


ప్రధాని సభ భద్రతను ఇద్దరు జాయింట్ సిపిలు, ముగ్గురు ఐపిఎస్ అధికారులు  పర్యవేక్షిస్తున్నారు. ఈ విధుల్లో మరో 300 మంది ట్రాఫిక్ పోలీసులు  పాల్గొంటున్నారు. ప్రధాని సభ దృష్ట్యా మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 8గంటల వరకూ ఎల్బీ స్టేడయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సభకు హాజరయ్యే వారి కోసం ట్రాఫిక్ పోసులు 6చోట్ల ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేశారు. బీసీలకే తెలంగాణ సీఎం సీటు అని ప్రకటించిన నేపథ్యంలో ఈ సభ హాట్ హాట్‌గా జరిగే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: