కుటుంబ వారసత్వ రాజకీయాలకు బీజేపీ దూరం అని చెబుతుంటారు. కానీ.. తాజాగా మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడు విజయేంద్ర....కర్ణాటక భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా అవకాశం ఇవ్వడం వివాదానికి దారి తీస్తోంది. విజయేంద్ర నియామకంపై ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. యడియూరప్ప రాజకీయ వారసునిగా విజయేంద్రను భావించాల్సి ఉంటుంది. అయితే పార్లమెంటు ఎన్నికల నాటికి కర్ణాటకలో పార్టీ బలపడటానికే ఈ ఎత్తు వేసినట్టు తెలుస్తోంది.


వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఈ సీనియర్‌ లింగాయత్‌ నేత ప్రభావం చూపిస్తారని బీజేపీ భావిస్తోంది. ఈ నియామకం ద్వారా రాజకీయంగా లబ్ది పొందాలని అధిష్ఠానం భావిస్తోంది. ఈ ఏడాది జరిగిన కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయేంద్ర గెలిచారు. అయితే ఇప్పటివరకు కర్ణాటక భాజపా అధ్యక్షునిగా నళిన్‌ కుమార్‌ కటీల్‌ ఉన్నారు. మే నెలలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఓటమి దృష్ట్యా ఆయన్ను తప్పించారు. మరి ఈ కొత్త అధ్యక్షుడి నియామకం ఎంత మేరకు లబ్ది చేకూరుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp