ఇవాళ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్‌ జరుగుతుంది. రాత్రి 7 నుంచి సింగరేణి ఓట్ల లెక్కింపు ఉంటుంది. బ్యాలెట్‌ పద్ధతిలో సింగరేణి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సింగరేణి ఎన్నికలకు 84 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 11 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సింగరేణి ఎన్నికల విధుల్లో పాల్గొననున్న 700 మంది సిబ్బంది పాల్గొంటున్నారు.


ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల పరిధిలో సింగరేణి ఎన్నికలు జరుగుతున్నాయి. మెుత్తం నాలుగు జిల్లాల్లోని 11 డివిజన్లలో ఉన్న సింగరేణి సంస్థకు ఈ ఎన్నికల్లో 39,775 మంది కార్మికులు ఓటేస్తారు. సింగరేణి ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు తలపడుతున్నాయి. కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్‌టీయూసీ, బీఆర్ఎస్‌ సంస్థ టీబీజీకేఎస్‌, సీపీఐ సంస్థ ఏఐటీయూసీ మధ్య ప్రధాన పోటీ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: