ప్రభుత్వం ఎంత చెప్పినా సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీలను జగన్ సర్కారు తొలగిస్తోంది. వాళ్లకు టెర్మినేషన్ ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. దాదాపు 80 వేల మందికి పైగా అంగన్వాడీలను తొలగిస్తూ టెర్మినేషన్ ఆర్డర్లు జగన్ సర్కారు సిద్ధం చేసింది. ప్రభుత్వ బెదిరింపులు, నోటీసుల జారీతో విధుల్లో చేరిన 20 శాతం మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు ఉద్యోగాలు మాత్రం ఉన్నాయి. మొత్తం 1 లక్షా 4 వేల మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లకు విధుల్లో చేరాల్సిందిగా ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

అంతే కాదు.. అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తవారిని నియమించుకునేందుకు 26న దరఖాస్తులు స్వీకరించాలని కలెక్టర్లు నిర్ణయించారు. ఈ నెల 24 తేదీన అంగన్వాడీల టెర్మినేషన్ కు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ చేయాలని నిర్ణయించారు. జనవరి 25న కొత్తవారిని నియమించుకునేందుకు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఇకనైనా అంగన్వాడీలు సమ్మె విరమిస్తారో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: