సీఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కవిత డెడ్‌లైన్‌ విధించారు. మాహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని శాసనసభలో ఏర్పాటు చేసే విషయమై ఆయన జయంతి ఏప్రిల్ 11వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాబట్టాలన్నది తమ టార్గెట్‌ అని భారత జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తెలిపారు. శానససభ ఆవరణలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో జాగృతి ఆధ్వర్యంలో ఆమె హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ నేతలు, ప్రొఫెసర్లు, వివిధ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు.


బడుగులకు స్ఫూర్తిగా ఉండాలంటే పూలే విగ్రహాన్ని అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్న కవిత.. ఇప్పటికే శాసనసభాపతికి విజ్ఞప్తి చేశామని, ప్రజాప్రతినిధులను కూడా కోరినట్లు తెలిపారు. పూలే విగ్రహం పెడితే బీసీలకు న్యాయం జరుగుతుందా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారని.. భారత జాగృతి తరపున బీసీల కోసం ఎన్నో పోరాటాలు చేసినట్లు కవిత వివరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: