ఏపీలో షర్మిల పీసీసీ అధ్యక్షురాలు అయ్యాక కాంగ్రెస్‌కు ఆ రాష్ట్రంపై ఆశలు చిగురిస్తున్నాయి. అందుకే కాస్త పుంజుకునేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. వాటిలో ప్రధానంగా ప్రత్యేక హోదాను ఈసారి కాంగ్రెస్‌ అస్త్రంగా మలచుకోవాలని భావిస్తోంది. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యక హోదా,  విభజన హామీలు, దుగారాజ పట్నం పోర్టు, పోలవరం ప్రాజెక్ట్ ను కేంద్రం పట్టించుకోలేదని.. విభజన హామీలు అమలు, పోలవరం నిధులు, నిర్వాసితులకు నష్టపరిహారం,  పునరావాసం కల్పించాలని పిసిసి లేఖ రాసినా... ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఏపీ కాంగ్రెస్ నేతలు అంటున్నారు.


హోంశాఖ, ఆర్థిక శాఖ మంత్రులకు లేఖ రాసినా స్పందన లేదని.. ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా తిరుపతి వచ్చినపుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. కానీ అది నెరవేర్చలేదని ఏపీ కాంగ్రెస్ గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర విభజనకు బీజం వేసింది బిజెపినే అంటున్న ఏపీ కాంగ్రెస్.. విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉందని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: