ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం కారణంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామంటున్నారు ఆటో డ్రైవర్లు. ఈ పధకం వల్ల తమ జీవనోపాధి దెబ్బతిన్నదని... కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకే మహిళల ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణానికి నిరసనగా ఈ నెల 15న హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కరోజు ఆటో బంద్ చేయబోతున్నారు. ఇప్పటికి 15 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆటో డ్రైవర్లు అంటున్నారు. ఇటీవల ప్రజా భవన్ ముందు ఓ ఆటో డ్రైవర్ తన ఆటోకు నిప్పు పెట్టుకున్న విషయాన్ని వారు గుర్తు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వానికి మహిళలపై నిజంగా ప్రేమ ఉంటే బస్సులలో ఉచితంగా ప్రయాణం కంటే... సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆటో డ్రైవర్లు అంటున్నారు. మద్యం కారణంగా మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని ఆటో డ్రైవర్లు తెలిపారు. తమను రోడ్డున పడేస్తున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసి... రాష్ట్రంలో మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: