రాజకీయ విమర్శలకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి.. జగన్ అనుచరులు భారీగా ఎర్రచందనం దోచేశారని ఆరోపించారు. అంత వరకూ కాస్త ఓకే.. కానీ రాష్ట్రంలో రూ.10 లక్షల కోట్ల ఎర్రచందనాన్ని జగన్ దోచేశారని భూమిరెడ్డి ఆరోపించారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఎర్రచందనం మాఫియా నిర్వహిస్తున్నారని.. చెవిరెడ్డి, విజయానంద రెడ్డి ఎర్రచందనం మాఫియా నిర్వహిస్తున్నారని భూమిరెడ్డి విమర్శిస్తున్నారు. విజయానంద రెడ్డి ఎర్రచందనాన్ని విదేశాల్లో అమ్ముతున్నారన్న భూమిరెడ్డి.. ఆ దోపిడీ సొమ్ము పెద్దిరెడ్డి, చెవిరెడ్డి ద్వారా జగన్‌కు చేరుస్తున్నారన్నారు.

చివరకు పోలీసులనే చంపే స్థాయికి ఎర్రచందనం మాఫియా ఎదిగిందని భూమిరెడ్డి ఎద్దేవా చేసారు. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన భూమిరెడ్డి.. నిందితుల వెనుక ప్రభుత్వ పెద్దలు ఉండటం వల్లే ఇష్టారీతిన చేస్తున్నారన్నారు. పోలీసుల మరణానికి కారణమైన వాహనాన్ని ట్రేస్ చేయలేదని.. పోలీసుల్ని ఢీకొట్టి వెళ్లిన వాహనం విజయానంద రెడ్డి శిష్యుడు శ్రీనివాస రెడ్డిదని.. భూమిరెడ్డి అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: