బాపూరావు పూలే విగ్రహం అసెంబ్లీలో పెట్టాలని ఇటీవల బీఆర్ఎస్‌ నేత కల్వకుంట్ల కవిత ఉద్యమం ప్రారంభించారు. అయితే దీనిపై ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపణలు గుప్పించారు. అధికారంలో ఉన్నప్పుడు భారాసకు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదు.. కవితకు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చాడా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నిస్తున్నారు.


కవితను ఒక విషయంపై ప్రశ్నిస్తున్నా.. మనకు ఒక ఎంపీ సీటు వస్తుంది అని ఫామ్ హౌజ్ కి వెళ్లి మీ నాన్నకు చెప్పు.. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగండి.. సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికీ తెలుసు.. కేసీఆర్ ఆరోగ్యం ఎలాగూ బాగోలేదు కదా.. కాబట్టి ఫ్లోర్ లీడర్ గా సీనియర్ అయిన, దళితుడు అయిన కడియంకు ఇవ్వండి.. మీ అన్న వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాగూ రాజ్యాలు విస్తరించుకునే పనిలో ఉన్నారు కదా.. కాబట్టి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక బీసీకి ఇవ్వండి అని సలహా ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: