రాను రాను విద్యార్థుల టాప్‌ మార్కులు చూస్తుంటే కళ్లు తిరుగుతున్నాయి. పదో తరగతిలో ఇప్పటి వరకూ 600లకు 590 పైచిలుకు మార్కులు చూశాం. కానీ నిన్న వచ్చిన ఏపీ పదో తరగతి  ఫలితాల్లో ఓ పాపకు వచ్చిన మార్కులు వైరల్‌ అవుతున్నాయి. 600 మార్కులకు ఆమెకు ఏకంగా 599 మార్కులు వచ్చాయి. 100, 99, 100, 100, 100, 100.. ఇలా వచ్చాయి మార్కులు.

ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి ఈ మార్కులతో అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఒక్క హిందీలో తప్ప మిగిలిన అయిదు సబ్జెక్టుల్లో వెంకట నాగసాయి మనస్వీకి 100కు వంద మార్కులు వచ్చాయి. నూజివీడులోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదివిన వెంకట నాగసాయి మనస్వీ మార్కులు చూసి ఆమె తల్లిదండ్రులు పొంగిపోతున్నారు. విచిత్రం ఏంటంటే... ఆమె తల్లితండ్రులైన ఆకుల నాగ వరప్రసాద్‌, నాగ శైలజ ఇద్దరూ ఉపాధ్యాయులే.


మరింత సమాచారం తెలుసుకోండి: