కేసీఆర్‌.. తెలంగాణలోనే టాలెస్ట్ లీడర్‌. ఆయనకు ఇప్పటి వరకూ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అన్నదే లేదు. మరి ఆయన ఎన్నికల సింబల్‌ ఏంటి అంటే కారు అని ఎవరైనా సింపుల్‌గా చెప్పేస్తారు. కానీ.. ఆయన కారు గుర్తుపైనే కాక.. ఇంకా అనేక గుర్తులపై ఎన్నికలు గెలిచారు. మరి ఆయన ఇప్పటి వరకూ ఎన్ని గుర్తులపై పోటీ చేశారో తెలుసా.. ఈ విషయాలను ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.


ప్రజలకు వ్యక్తులు, వారి నిబద్ధతే ప్రధానమని చెప్పిన కేసీఆర్‌.. అవి ఉంటే.. ప్రజలు గుర్తులను పట్టించుకోకుండానే ఓటేస్తారని వివరించారు. తాను ఇప్పుడు కారు గుర్తుపై గెలుస్తున్నానని చెప్పిన కేసీఆర్‌.. పాత విషయాలు గుర్తు చేసుకున్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సైకిల్‌ గుర్తుపై గెలిచానని.. ఒకసారి పంచాయతీ ఎన్నికల్లో తనకు రైతు, నాగలి గుర్తు కేటాయించారని అప్పుడు కూడా గెలిచానని చెప్పారు. ఒకసారి తనకు బస్సు గుర్తు వచ్చిందని.. ఆ గుర్తు పై కూడా తాను గెలిచానని కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద కేసీఆర్‌ ఇప్పటి వరకూ రైతు- నాగలి, బస్సు, సైకిల్‌, కారు గుర్తులపై గెలిచారన్నమాట. అయితే కేసీఆర్‌కు వాహనాలే బాగా కలసివస్తాయేమో.  

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr