సరిగ్గా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు జగన్‌కు ఓ బ్రహ్మాస్త్రం దొరికింది. టీడీపీ గ్యాంగ్‌ ఓవర్‌ యాక్షన్ కారణంగా వాలంటీర్లను ఈసీ పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉంచింది. గత నెలలో సకాలంలో పెన్షన్లు అందక చాలా మంది ఇబ్బంది పడ్డారు. 40-50 మంది వరకూ వృద్దులు చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. అయితే.. ఈ మే ఫస్ట్‌కు కూడా అదే పరిస్థితి వస్తే.. అది జగన్‌కు బిగ్‌ ప్లస్‌ పాయింట్ అవుతుంది.


అందుకే ఈ ఫస్ట్‌కు కూడా వృద్ధులు పడే ఇబ్బందులను తన మీడియాలో సోషల్ మీడియాలో బాగా హైలెట్‌ చేయాలని జగన్ గ్యాంగ్ ప్లాన్‌ చేస్తోంది. సరిగ్గా ఎన్నికలకు ముందే పెన్షన్లు ఉండటం వల్ల ఆ ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు గెలిస్తే ఇక నెలనెలా ఇదే ఇబ్బంది వస్తుందని ప్రచారం చేయాలని జగన్ గ్యాంగ్ భావిస్తోంది. దీన్ని మరి టీడీపీ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: