ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాలు,  విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఓటర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలా మంది ఓటర్లు తమ గ్రామాలకు వెళ్లిపోయారు. ఇలా వెళ్లడానికి సెలవులు ఓ కారణం కాగా.. ఇంకో కారణం భూముల గురించేనని చర్చ బలంగా సాగుతోంది.

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ భూమలు గల్లంతే అంటూ రాష్ట్ర వ్యాప్తంగా విపక్షాలు ప్రచారం చేయడంతో చాలా చోట్ల ఓటర్లు ఆందోళనకు గురయ్యారు. ఓటర్లలో భూములున్న వారు.. స్వస్థలాలకు ముందే చేరుకొని సరిహద్దు రాళ్ల దగ్గర నుంచి సంబంధిత భూములు గురించి ప్రభుత్వ కార్యాలయాల్లో వాకబు చేయడం మొదలు పెట్టారు. ఆక్రమణకు గురైన చోట ఫిర్యాదులు చేశారు. ఇదిలా ఉండగా అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏంటి. దాని వల్ల నష్టమా? లాభమా అనే చర్చ అయితే గ్రామాల్లో జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: