నటి రేణు దేశాయ్‌ ఇన్‌స్టా వేదికగా పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. ఓ క్యూఆర్‌ కోడ్ పోస్ట్‌ చేసి, జంతు సంరక్షణ కోసం 3,500 రూపాయల నగదు కావాలని నటి రేణు దేశాయ్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. దాన్ని చూసిన అభిమానులు వెంటనే.. కొందరు నగదు బదిలీ చేశారు. మరికొందరు మాత్రం రేణుదేశాయ్‌ ఏంటి  3వేల500 కోసం విరాళాలు అడగడం ఏంటి.. అని ఆశ్చర్యంతో పాటు అనుమానం వ్యక్తం చేశారు.


బహుశా రేణు దేశాయ్‌ ఖాతాను దుండుగులు హ్యాక్‌ చేసి ఉంటారేమోనని అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆమె స్వయంగా వీడియో పోస్ట్‌ చేశారు. గత కొన్ని రోజులుగా తనకు స్వల్ప అస్వస్థత ఉందని అందుకే వీడియో రూపంలో అడగలేకపోయానని రేణు దేశాయ్‌ తెలిపారు. తన ఖాతాను ఎవరూ హ్యాక్ చేయలేదని రేణు దేశాయ్‌ స్పష్టం చేసింది. తాను నెల బడ్జెట్‌లో కొంత విరాళానికి కేటాయిస్తానని, ఈ నెల విరాళాల కోటా పూర్తవడంతో జంతు సంరక్షణకు సాయం కోరానని రేణు దేశాయ్‌ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: