వచ్చే నెల రెండో తేదీతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి విడిపోయి..తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్ల సమయం కూడా పూర్తి కానుంది. అయినా ఉమ్మడి రాష్ట్రంలోని వివిధ కార్పోరేషన్లు, సంస్థల విభజన వ్యవహారం పదేళ్లు అవుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు. జూన్ రెండో తేదీ సమీపిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విభజన అంశాలపై దృష్టి సారించారు. రేపటి మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలపై రేవంత్‌ రెడ్డి చర్చించనున్నారు.


రేపటి కేబినెట్ భేటీకి అన్ని అంశాలను నివేదించే పనిలో అధికారులు ఉన్నారు. అందులో భాగంగా అన్ని శాఖల నుంచి ఆర్థికశాఖ వివరాలు కోరింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం ఈ మేరకు 32 శాఖలకు నోట్ పంపింది. ఆయా శాఖల్లోని కార్పోరేషన్లు, సంస్థలకు సంబంధించిన విభజన అంశాలు, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. వాటి ఆధారంగా మంత్రివర్గ సమావేశానికి నివేదిక సమర్పిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: